న్యూ ఇయర్: అర్థరాత్రి ఒంటిగంట వరకు బార్లు, క్లబ్‌లు ఓపెన్

న్యూ ఇయర్: అర్థరాత్రి ఒంటిగంట వరకు బార్లు, క్లబ్‌లు ఓపెన్
న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా బార్లు, క్లబ్బులకు, వైన్ షాపులకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. డిసెంబర్31, జనవరి 1వ తేదీల్లో బార్లు, క్ల‌బ్బులు అర్థరాత్రి ఒంటిగంట వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా…అర్థరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు తెరిచే ఉంటాయని తెలిపింది. అయితే… తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది.