భారతీయ రైల్వే చరిత్రలో మరో నూతన అధ్యాయం: మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

భారతీయ రైల్వే చరిత్రలో మరో నూతన అధ్యాయం: మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే చరిత్రలో మరో నూతన అధ్యాయం లిఖించబడింది. తొలి వందే భారత్ స్లీపర్ రైలు రయ్యు రయ్యు మంటూ పట్టాలపై పరుగులు పెట్టింది. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా శనివారం (జనవరి 17) మాల్డా రైల్వే స్టేషన్‎లో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు హౌరా-గౌహతి (కామాఖ్య) మధ్య రాకపోకలు సాగించనుంది. ఇండియా ఫస్ట్ స్లీపర్ వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటన విడుదల చేసింది. 

ఆధునిక భారతదేశంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి వందే భారత్ స్లీపర్ రైలు సిద్ధంగా ఉందని పేర్కొంది. ప్రయాణీకులకు తక్కువ ఛార్జీలతో ఫ్లైట్ జర్నీ అనుభూతి అందిస్తోందని తెలిపింది. ఈ ట్రైన్ సుదూర ప్రయాణాలను వేగంగా, సురక్షితంగా, మరింత సౌకర్యవంతంగా చేస్తుందని పేర్కొంది. హౌరా-గువహతి (కామాఖ్య) మార్గంలో ప్రయాణ సమయాన్ని దాదాపు 2.5 గంటలు గణనీయంగా తగ్గిస్తోందని వెల్లడించింది. పర్యాటక రంగానికి కూడా వందే భారత్ స్లీపర్ ట్రైన్ భారీ ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొంది.

ALSO READ : బిగ్గెస్ట్ ఇన్వెస్ట్ ఏరియాగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ 

వందే భారత్ స్లీపర్ ఫీచర్లు ఇవే.. 

కాగా ప్రారంభ తేదీ నుంచి 20 రోజుల్లో వందే భారత్ స్లీపర్ రైలు రెగ్యులర్​ సర్వీసులు ప్రారంభం అవుతాయి. 16 కోచ్‌‌ల వందే భారత్ స్లీపర్ ట్రైన్‌‌లో మొత్తం 823 ప్రయాణికులు ప్రయాణించవచ్చు. దీనిలో 11 థర్డ్ ఏసీ కోచ్‌‌లు (611 బెర్త్‌‌లు), నాలుగు సెకండ్ ఏసీ కోచ్‌‌లు (188 బెర్త్‌‌లు), ఒక ఫస్ట్ ఏసీ కోచ్ (24 బెర్త్‌‌లు) ఉంటాయి. ఈ ట్రైన్​ స్పీడ్ కెపాసిటీ గంటకు 180 కి.మీ. కానీ గువాహటి-– కోల్‌‌కతా మధ్య 120-–130 కి.మీ. స్పీడ్ తో నడుస్తుందన్నారు. 

ఈ ట్రైన్‎లో​థర్డ్​ఏసీ సీటు ధర సుమారు రూ.2,300, సెకండ్​ ఏసీలో అయితే రూ.3 వేలు, ఫస్ట్​ ఏసీ అయితే  రూ.3,600 ఉండే అవకాశం ఉంది. ఇదే రూటులో ఫ్లైట్​టికెట్ ధర రూ.6  వేల నుంచి రూ.8 వేల వరకు ఉంటుంది. మధ్య తరగతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ధరలు నిర్ణయించారు. గువాహటి నుంచి బయలుదేరే ట్రైన్‌‌లో అస్సామీ వంటకాలు, కోల్‌‌కతా నుంచి బయలుదేరే ట్రైన్‌‌లో బెంగాలీ వంటకాలు అందుబాటులో ఉంటాయి. 

ALSO READ : యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్‌కి అడ్డంకిగా పప్పు ధాన్యాలు.. అసలు ఏమైందంటే..?

  • క్వాలిటీ డిజైన్ బెర్త్‌‌లు, మంచి కుషనింగ్
  • ఆటోమేటిక్ డోర్లు, బోగీ మధ్య కుదుపు లేని భాగం
  • సుపీరియర్ సస్పెన్షన్, నాయిస్ రిడక్షన్
  • కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్
  • ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్