
లక్డీకపూల్‌లోని డీజీపీ ఆఫీసులో సోమవారం న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. డీజీపీ అంజనీకుమార్ కేక్ కట్ చేశారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో సిబ్బంది ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుకల్లో సిటీ సీపీ ఆనంద్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన ఆయన అందరికీ విషెస్ తెలిపారు. ఖైరతాబాద్‌లోని వాటర్ బోర్డు హెడ్డాఫీసులో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాటర్‌బోర్డు ఇంజినీర్స్ అసోసియేషన్(జేఈఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు చీఫ్ గెస్టుగా హాజరైన ఎండీ దానకిశోర్.. జేఈఏ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
గాంధీ హాస్పిటల్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలకు డీఎంఈ రమేశ్ రెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, గాంధీ టీజీజీడీఏ యూనిట్ ప్రెసిడెంట్ ఎస్. రాజేశ్వరరావు పాల్గొన్నారు. అంతకుముందు సీఎస్ సోమేశ్‌కుమార్‌ను గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు.
- వెలుగు, హైదరాబాద్/పద్మారావునగర్