కొత్త సంవత్సరం జోష్.. కేకులకు భారీ డిమాండ్

కొత్త సంవత్సరం జోష్.. కేకులకు భారీ డిమాండ్

హైదరాబాద్ నగరంలో అందరిలోనూ న్యూ ఇయర్ జోష్ మొదలైంది. సెలబ్రేషన్స్ లో భాగంగా కేక్ సేల్స్ భారీగా జరుగుతున్నాయి. ఆన్ లైన్  ఆర్డర్లు, టేక్ అవేలతో బేకరీలు బిజీగా మారాయి. రెండ్రోజుల నుంచే న్యూఇయర్ కేక్స్ కు సంబంధించి మేకింగ్, మెటీరియల్ అంతా రెడీగా ఉంచుకున్నామని వ్యాపారులు చెప్తున్నారు. కేక్స్ లో కొత్త కొత్త వెరైటీలు, డిజైన్స్, రుచులు స్పెషల్  డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎంజాయ్ మెంట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న యువత.. ఎంత కాస్ట్ అయినా కొనేందుకు ముందుకొస్తున్నారు.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బేకరీలు నోరూరించే కేక్‌లను తయారు చేస్తున్నారు. దాంతో పాటు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నారు. వెనీలా కేక్‌, స్ట్రాబెర్రీ, బట్టర్‌ స్కాచ్‌, ప్రూట్స్‌కేక్‌, కూల్‌కేక్‌తో పాటు పలు రకాలైన కేక్‌లను అమ్మకాలకు సిద్ధం చేస్తున్నారు. ఈ కేక్‌లు కేజీకి రూ.250 నుంచి రూ.800 వరకు అమ్మకాలకు పెడుతున్నారు. ఎగ్‌లెస్‌, కూల్‌ కేక్‌లు కేజీ రూ.350 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నారు.