న్యూఇయర్ కిక్కు.. రాష్ట్ర సర్కార్​కు భారీగా ఆదాయం

న్యూఇయర్ కిక్కు.. రాష్ట్ర సర్కార్​కు భారీగా ఆదాయం
  • డిసెంబర్ 30న 254 కోట్లు, 31న 215 కోట్ల అమ్మకాలు 
  • పోయిన నెలలో మొత్తం 3,376 కోట్ల సేల్స్ 


హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఖజానాకు న్యూఇయర్ కిక్కు ఇచ్చింది. లిక్కర్ సేల్స్ తో సర్కార్ కు భారీగా ఆదాయం వచ్చింది. డిసెంబర్ చివరి ఆరు రోజుల్లో ఏకంగా రూ.1,111.24 కోట్ల మద్యం అమ్ముడైంది. 26న రూ.182.28 కోట్లు, 27న రూ.155.29 కోట్లు, 28న రూ.144.79 కోట్లు, 29న రూ.159.14 కోట్లు, 30న రూ.254 కోట్లు, 31న రూ.215.74 కోట్ల మద్యం డిపోల నుంచి లిఫ్ట్ చేశారు. 

ఈసారి న్యూఇయర్ వేడుకలకు స్పెషల్ ఈవెంట్లకు సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. 31న అర్ధరాత్రి ఒంటిగంట వరకు బార్లకు, 12 గంటల వరకు వైన్స్ కు అనుమతి ఇచ్చింది. దీంతో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి. 31న సాయంత్రం నుంచే వైన్స్ వద్దజనం పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఆ రోజు రూ.215.74 కోట్ల మద్యం అమ్ముడైంది. దాదాపు 2.17 లక్షల లిక్కర్ (ఐఎంఎల్) కేసులు, లక్షా 28 వేల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. పోయినేడు డిసెంబరు 31న కేవలం రూ.171.93 కోట్ల లిక్కర్ సేల్ కాగా, ఈసారి ఏకంగా రూ.215.74  కోట్ల మద్యం అమ్ముడైంది. కాగా, డిసెంబర్ లో మొత్తం రూ.3,376 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి.