అమెరికాలో వరదలు: న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో ఎమర్జెన్సీ ప్రకటన

V6 Velugu Posted on Sep 02, 2021

అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.  రికార్డ్ స్థాయిలో కురిసిన వర్షం కారణంగా భయంకరమైన వరదలు రావడంతో.. ఎమర్జెన్సీ ప్రటిస్తున్నట్టు న్యూయార్క్ సిటీ మేయర్ బిల్ డె బ్లాసియో, న్యూజెర్సీ గవర్నర్ ఫిల్‌ ముర్ఫే ట్వీట్ చేశారు. వరద ప్రమాదకర స్థాయిలో ఉందని, ఎవరూ ఇండ్లు దాటి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. రోడ్లు, సబ్‌ వేల వద్ద పరిస్థితి బీభత్సంగా ఉందని, వెహకల్స్ డ్రైవ్‌ చేసుకుని రోడ్లపైకి వచ్చే సాహసం చేయొద్దని చెప్పారు. ఎమర్జెన్సీ రెస్పాండర్స్ సహాయక చర్యల్లో ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఐదా హరికేన్ తో న్యూయార్క్ స్టేట్ మొత్తం అతలాకుతలమవుతోంది. న్యూయార్క్ సిటీ వీధులు నీటితో నిండిపోయాయి. ఒక గంటసేపట్లోనే సిటీలో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సిటీలోని సబ్ వేలన్నింటిని క్లోజ్ చేశారు. ఎయిర్ పోర్ట్ లోకి కూడా నీరు చేరింది. దీంతో న్యూయార్క్ తో నుంచి న్యూజెర్సీకి విమానాల రాకపోకలు ఆపేశారు. లూసియానాలోనూ వేలాది ఇళ్లకు కరెంట్ కట్ అయింది.

 

 

Tagged EMERGENCY, new jersey, floods, New York, Hurricane Ida

Latest Videos

Subscribe Now

More News