సెమీస్‌‌‌‌‌‌‌‌కు న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌!.. 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపు

సెమీస్‌‌‌‌‌‌‌‌కు న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌!.. 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపు
  •     రాణించిన కాన్వే, మిచెల్‌‌‌‌‌‌‌‌, రవీంద్ర
  •     చెలరేగిన బౌల్ట్‌‌‌‌‌‌‌‌, ఫెర్గుసన్‌‌‌‌‌‌‌‌, శాంట్నర్‌‌‌‌‌‌‌‌

బెంగళూరు : సెమీస్‌‌‌‌‌‌‌‌ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ చెలరేగింది. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో అదరగొడుతూ.. గురువారం జరిగిన ఆఖరి లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కివీస్‌‌‌‌‌‌‌‌ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. దీంతో 10 పాయింట్లు, మెరుగైన నెట్‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌రేట్‌‌‌‌‌‌‌‌తో దాదాపుగా సెమీస్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌ను ఖాయం చేసుకుంది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. కుశాల్‌‌‌‌‌‌‌‌ పెరీరా (28 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 51), మహీశ్‌‌‌‌‌‌‌‌ తీక్షణ (38 నాటౌట్‌‌‌‌‌‌‌‌) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. బౌల్ట్‌‌‌‌‌‌‌‌ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ 23.2 ఓవర్లలో 172/5 స్కోరు చేసి గెలిచింది. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే ఓపెనర్లు డేవన్‌‌‌‌‌‌‌‌ కాన్వే (42 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 9 ఫోర్లతో 45), రాచిన్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర (34 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 42) దంచికొట్టారు.

ఈ ఇద్దరు తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 86 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే ఐదు బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో వీరిద్దరూ ఔటయ్యారు. వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ (14) ఫెయిలైనా.. డారిల్‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌ (31 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 43) వేగంగా ఆడాడు. కానీ19, 21 ఓవర్లలో మాథ్యూస్‌‌‌‌‌‌‌‌ (2/29) .. విలియమ్సన్‌‌‌‌‌‌‌‌, మార్క్‌‌‌‌‌‌‌‌ చాప్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ (7) వికెట్లు తీయడంతో కివీస్‌‌‌‌‌‌‌‌ 145/4తో నిలిచింది. మరో రెండు ఓవర్ల తర్వాత మిచెల్‌‌‌‌‌‌‌‌ కూడా వెనుదిరిగినా ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ (17 నాటౌట్‌‌‌‌‌‌‌‌), లాథమ్‌‌‌‌‌‌‌‌ (2 నాటౌట్‌‌‌‌‌‌‌‌) ఈజీగా గెలిపించారు. తీక్షణ, చమీరా చెరో వికెట్‌‌‌‌‌‌‌‌ తీశారు. బౌల్ట్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. 

బౌలర్లు భళా..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన లంకను.. కివీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ముఖ్యంగా ట్రెంట్‌‌‌‌‌‌‌‌ బౌల్ట్‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌తో పాటు సూపర్‌‌‌‌‌‌‌‌ స్వింగ్‌‌‌‌‌‌‌‌తో చెలరేగాడు. రెండో ఓవర్‌‌‌‌‌‌‌‌లో నిశాంక (2) వికెట్‌‌‌‌‌‌‌‌ తీసి సౌథీ (1/52) ఇచ్చిన ఆరంభాన్ని బౌల్ట్‌‌‌‌‌‌‌‌తో పాటు మిగతా బౌలర్లు ఫెర్గుసన్‌‌‌‌‌‌‌‌ (2/35), శాంట్నర్‌‌‌‌‌‌‌‌ (2/22), రాచిన్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర (2/21) చివరి వరకు కంటిన్యూ చేశారు. కుశాల్‌‌‌‌‌‌‌‌ పెరీరా నిలకడగా ఆడినా.. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో వరుస విరామాల్లో వికెట్లు తీసి లంకేయులను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ క్రమంలో కుశాల్‌‌‌‌‌‌‌‌ మెండిస్‌‌‌‌‌‌‌‌ (6), సమరవిక్రమ (1), చరిత్‌‌‌‌‌‌‌‌ అసలంక (8) సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు.

అప్పటికే ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయిన పెరీరా 22 బాల్స్‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ చేసి 10వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో వెనుదిరిగాడు. తర్వాత మాథ్యూస్‌‌‌‌‌‌‌‌ (16), ధనంజయ్‌‌‌‌‌‌‌‌ డిసిల్వా (19) ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను ఆదుకునే ప్రయత్నం చేసినా కివీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. 17, 19వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో శాంట్నర్‌‌‌‌‌‌‌‌ వరుసగా మాథ్యూస్‌‌‌‌‌‌‌‌, డిసిల్వాను ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఈ దశలో తీక్షణ టెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడాడు. డెడ్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌తో వికెట్‌‌‌‌‌‌‌‌ను కాపాడుకుంటూ సింగిల్స్‌‌‌‌‌‌‌‌తో ముందుకెళ్లాడు. కానీ అవతలి వైపు కరుణరత్నె (6), చమీరా (1), మధుషంక (19) ఫెయిల్‌‌‌‌‌‌‌‌ కావడంతో లంక చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌కే పరిమితమైంది. 

సంక్షిప్త స్కోర్లు : 

శ్రీలంక : 46.4 ఓవర్లలో 171 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (కుశాల్‌‌‌‌‌‌‌‌ పెరీరా 51, తీక్షణ 38*, బౌల్ట్‌‌‌‌‌‌‌‌ 3/37 ).

 న్యూజిలాండ్‌ ‌‌‌‌‌‌‌: 23.2 ఓవర్లలో 172/5 (కాన్వే 45, మిచెల్‌‌‌‌‌‌‌‌ 43, మాథ్యూస్‌‌‌‌‌‌‌‌ 2/29).