Virat Kohli vs Ravi Shastri: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో అడుగుపెడితే ఎలా ఉంటాడో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒక్కసారి గ్రౌండ్‌లోకి దిగిన తర్వాత కోహ్లీ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా చేంజ్ అవుతుంది. ప్రత్యర్థి జట్టు కవ్వింపు చర్యలకు దిగితే వారి శైలిలోనే ఆన్సర్ ఇస్తాడు.. స్లెడ్జింగ్‌కు దిగిన వారికి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తాడు. అదే సమయంలో అంతే సరదాగానూ ఉండటం కోహ్లీకే చెల్లింది. కానీ, కొంతమంది మాత్రం విరాట్ కోహ్లీని అహంకారి, కోపిష్టి అంటూ విమర్శిస్తూ ఉంటారు. తాజాగా ఇదే తరహాలో కోహ్లీని విమర్శిస్తూ టీమిండియా మాజీ కోచ్ ఓ పోస్టు పెట్టారు.
నిజంగానే కోహ్లీ అహంకారి:
విరాట్ కోహ్లీని విమర్శిస్తూ వచ్చిన పోస్టుపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. అహంకారి, అతి గారాబం వల్ల చెడిపోయిన అల్లరిపిల్లాడు.. దూకుడు.. కోహ్లీ గురించి వాళ్లు అన్న ప్రతీ మాటలో నిజం ఉందన్నాడు. కానీ, ఇదంతా క్రికెట్ స్టేడియంలో ఉన్నంత వరకే. గ్రౌండ్ బయట విరాట్ ఇందుకు పూర్తి విభిన్నంగా ఉంటాడని వెల్లడించాడు. ఎక్కడ ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తులంటే నాకు చాలా ఇష్టం.. స్టేడియంలో కింగ్ కోహ్లీ చూపించే అగ్రెషన్ క్రీడలో భాగమేనని శాస్త్రి పేర్కొన్నారు.
కోహ్లీ– రవిశాస్త్రి మధ్య ప్రత్యేక అనుబంధం:
రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా, కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో భారత జట్టు అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్‌లో నంబర్ వన్‌గా నిలిచి సత్తా చాటింది. ఆ తర్వాత ఈ ఇద్దరు తమ తమ పదవుల నుంచి తప్పుకున్నప్పటికీ, వారి మధ్య ఉన్న అనుబంధం మాత్రం అలాగే కొనసాగుతోంది. తాజాగా రవిశాస్త్రి చేసిన కామెంట్స్ తో ఈ విషయం మరోసారి రూజువైంది.
వన్డే సిరీస్‌కు కింగ్ కోహ్లీ దూరం:
ఇటీవలే ముగిసిన ఐపీఎల్-2026 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజేతగా నిలవడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన కోహ్లీ.. ఆఫ్ఘనిస్తాన్‌తో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం అతని స్థానంలో యశస్వి జైస్వాల్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు రవిశాస్త్రి ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాన్నాడు.
RAVI SHASTRI ON VIRAT KOHLI:
— Kashif (@KashifNdmCric) June 15, 2026
- "I identified Virat very early that he's my leader. The moment MS finishes, he's next for me". (One8). pic.twitter.com/w1O72THR4W
