మహేష్ బాబు 'వారణిసి'కి బడ్జెట్ కష్టాలు.. ఈ సారి తలకిందులైన జక్కన్న లెక్కలు!

మహేష్ బాబు 'వారణిసి'కి  బడ్జెట్ కష్టాలు.. ఈ సారి తలకిందులైన జక్కన్న లెక్కలు!

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' ( Varanasi ) . సుమారు రూ. 1400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.  అయితే ఇప్పుడు ఈ సినిమా చుట్టూ ఇండస్ట్రీలో ఒక క్రేజీ అండ్ షాకింగ్ బజ్ నడుస్తోంది. స్క్రీన్ మీద అద్భుతాలు సృష్టించే జక్కన్నకు, రియల్ లైఫ్ మార్కెట్ లెక్కలు ఇప్పుడు కొత్త సవాళ్లు విసురుతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

తలకిందులైన OTT లెక్కలు

ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు కేవలం డిజిటల్ (OTT) రైట్స్ ద్వారానే సుమారు రూ. 600 కోట్లు రికవరీ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, ప్రస్తుత డిజిటల్ మార్కెట్ రియాలిటీస్ పూర్తిగా మారిపోయాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజాలు ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ సినిమాకైనా రూ. 150 కోట్లు  నుంచి- రూ. 200 కోట్ల కంటే ఎక్కువ పెట్టేందుకు సిద్ధంగా లేవు. ఈ మార్కెట్ క్రాష్ 'వారణాసి' నిర్మాతలపై విపరీతమైన ఒత్తిడి పెంచేసింది. 

మాస్టర్ ప్లాన్ మార్చుతున్న టీమ్

బడ్జెట్ వ్యయం అంతకంతకు పెరగడంతో దానిని కంట్రోల్ చేసేపనిలో పడ్డారు నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి తన ఫీజును తగ్గించుకోబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే, రాజమౌళి సాధారణంగా ముందస్తు ఫీజు కంటే సినిమా లాభాల్లో వాటా మోడల్‌లోనే వర్క్ చేస్తారు. కాబట్టి ఆయన ఫీజు తగ్గించుకున్నా, తక్షణ ఖర్చుల భారం పెద్దగా తగ్గకపోవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో భారీ ఖర్చుతో కూడిన ఓవర్సీస్ లొకేషన్ల కంటే, విజువల్ గ్రాండ్‌నెస్ తగ్గకుండా తక్కువ బడ్జెట్‌లో పూర్తయ్యే లొకేషన్లను ఎంచుకుంటున్నారు. షూటింగ్ షెడ్యూల్స్‌ను మరింత పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద అగ్నిపరీక్ష..
ఇటీవల కాలంలో వస్తున్న మెగా బడ్జెట్ సినిమాలు భారీ హైప్ తెచ్చుకున్నప్పటికీ, పెట్టిన పెట్టుబడిని వెనక్కి రాబట్టడం అంత సులువు కాదని రుజువు చేస్తున్నాయి. కేవలం థియేట్రికల్ రన్ మీదే వందల కోట్ల భారం పడనుండటంతో, 'వారణాసి' కమర్షియల్ సక్సెస్ కావడం రాజమౌళి బ్రాండ్ ఇమేజ్‌కు అగ్నిపరీక్షగా మారింది.

ఏది ఏమైనప్పటికీ, రాజమౌళి విజన్, మహేష్ బాబు గ్లోబల్ కటౌట్ కలుస్తుండటంతో ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌గా ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్. మరి ఈ బడ్జెట్ సవాళ్లను దాటుకుని జక్కన్న ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తారో చూడాలి.