Cricket World Cup 2023: కీలక మ్యాచ్‌లో శివాలెత్తిన న్యూజిలాండ్ .. పాక్ ముందు భారీ టార్గెట్

Cricket World Cup 2023: కీలక మ్యాచ్‌లో శివాలెత్తిన న్యూజిలాండ్ .. పాక్ ముందు భారీ టార్గెట్

వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ విశ్వరూపాన్ని చూపించింది. వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిన ఆ జట్టు కీలక మ్యాచ్ లో సత్తా చాటింది. పాక్ బౌలర్లను చితక్కొడుతూ భారీ స్కోర్ చేశారు. బెంగళూరు లోని చిన్నస్వామి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజీలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. 

రచీన్ రవీంద్ర(108) తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ ఈ టోర్నీలో మరో సెంచరీ చేస్తే, రీ ఎంట్రీలో కెప్టెన్ విలియంసన్ 95 పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోయాడు. వీరిద్దరి ధాటికి కివీస్ స్కోర్ పరుగులెత్తింది. రెండో వికెట్ కు వీరిద్దరి జోడీ ఏకంగా 180 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెనర్ కాన్వే (35), మిచెల్(29), ఫిలిప్స్ (41), చాప్ మన్ (39), సాంట్నర్(26) తలో చేయి వేయడంతో పాక్ ముందు 402 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. 

ALSO READ :- 19 ఏళ్లు లేవు.. అంబానీకే వార్నింగ్ ఇస్తున్నాడు..

ఇక ఈ మ్యాచ్ లో పాక్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. మొదటి నుంచి ఏ మాత్రం ప్రభావం చూపకుండా చెత్త బౌలింగ్ తో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పాక్ బౌలర్లలో మహ్మద్ వసీం జూనియర్ ఒక్కడే 10 ఓవర్లలో 60 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకొని రాణించాడు. హసన్ అలీ, హారిస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్ కు ఒక వికెట్ లభించింది.