ప్రత్యర్థులు మారినా..న్యూజిలాండ్ తలరాత మారడం లేదు

ప్రత్యర్థులు మారినా..న్యూజిలాండ్ తలరాత మారడం లేదు

ఐసీసీ మెగా టోర్నీల్లో న్యూజిలాండ్ను దరిద్రం వెంటాడుతోంది. సాధారణ సిరీస్లలో బాగానే రాణించే న్యూజిలాండ్..ఐసీసీ ఈవెంట్లలో మాత్రం  చతికిలపడుతోంది.  2015 వరల్డ్ కప్ నుంచి ప్రతీ ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ దశ నుంచి నిష్క్రమిస్తూ వస్తోంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022లో సెమీస్ చేరిన కివీస్..సెమీస్ లో ఒత్తిడిని జయించలేక..పాక్ చేతిలో ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. మరోసారి టైటిల్ చేజార్చుకుంది. 

వరుసగా ఐదో టోర్నీ..
టీ20 ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శనతో న్యూజిలాండ్ గ్రూప్ 1 టాపర్గా నిలిచింది. ఇదే క్రమంలో  సెమీ ఫైనల్ చేరింది. అయితేసెమీస్లో  పాకిస్థాన్‌ను ఓడించలేక ఇంటిదారి పట్టింది. వరుసగా ఐదో వరల్డ్ కప్లోనూ విజేతగా నిలవలేకపోయింది. 2015 ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత ఆ జట్టు ప్రతీ ఐసీసీ టోర్నీలో నాకౌట్ దశ దాటింది.  కానీ విశ్వవిజేతగా మాత్రం నిలవలేదు. ఒక్క  2017 ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే గ్రూప్ దశలో నిష్క్రమించింది. 

కేన్ మామ దురదృష్టం..
కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్  నాలుగు సార్లు టైటిల్ చేజార్చుకుంది. ఇందులో రెండు సార్లు సెమీస్ లలో ఓడిపోయింది. మరో రెండు సార్లు ఫైనల్లో పరాజయం చవిచూసింది. 2016  టీ20 వరల్డ్ కప్ సెమీస్ న్యూజిలాండ్  ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలోనే ఓటమిపాలైంది. ఆ తర్వాత గతేడాది టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడి టైటిల్ కోల్పోయింది.