ఈ బుడ్డోల్లేంటి.. ఆడోల్లేంటి: వినూత్న రీతిలో న్యూజిలాండ్ వరల్డ్ కప్ జట్టు ప్రకటన

ఈ బుడ్డోల్లేంటి.. ఆడోల్లేంటి: వినూత్న రీతిలో న్యూజిలాండ్ వరల్డ్ కప్ జట్టు ప్రకటన

భారత్ లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ కి తాజాగా న్యూజిలాండ్ జట్టుని ప్రకటిచేశారు. సీనియర్లకు పెద్ద పీట వేసిన సెలక్టర్లు.. 15 మందితో కూడిన స్క్వాడ్ ని రిలీజ్ చేశారు. గాయంతో  కొన్ని నెలలుగా జట్టుకి దూరంగా ఉంటున్న కేన్ విలియమ్సన్ తిరిగి జట్టులోకి చేరాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో ఫీల్డింగ్ చేస్తూ కేన్ గాయపడిన సంగతి తెలిసిందే. ఇక ఈ జట్టులో టిమ్ సౌథీ, ట్రెంట్ బోల్ట్, జిమ్మీ నిషామ్,ఇష్ సోధి లాంటి సీనియర్లను సెలక్ట్ చేస్తూ వరల్డ్ కప్ కి అనుభవం చాలా ముఖ్యమని చెప్పకనే చెప్పింది  కివీస్ బోర్డు.

జేమిసన్, ఫిన్ అలెన్ కి నో ఛాన్స్ 

న్యూజీలాండ్ జట్టులో స్టార్ పేసర్ జేమిసన్, ఓపెనర్ ఫిన్ అలెన్ కి సెలక్టర్లు మొండి చేయి చూపించారు. గత కొంతకాలంగా వీరు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించినప్పటికీ..ఇటీవలే కాలంలో పేలవ ఫామ్ తో జట్టుకి భారంగా మారారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి వీరి సెలక్ట్ చేసే సాహసం చేయలేదు. ఇక స్పిన్నర్ రచీన్ రవీంద్రకు, లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ మార్క్ చాప్ మన్ కి స్క్వాడ్ లో  చోటు దక్కడం విశేషం. కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. టామ్ లాధం వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.

కుటుంబసభ్యుల చేత వరల్డ్ కప్ జట్టు ప్రకటన

కివీస్ జట్టు ఈ వరల్డ్ కప్ కి వినూత్నంగా వరల్డ్ కప్ జట్టుని ఎంపిక చేసింది. వారి ఫ్యామిలీకి చెందిన పిల్లలు, భార్య, తల్లి దండ్రులలో  ఎవరో ఒకరి చేత ప్లేయర్ పేరుని అనౌన్స్ చేయించింది. న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు కొత్తగా ఆలోచిస్తూ చేసిన ఈ ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ వీడియో మీరు కూడా చూసేయండి. 

  Also Read : గోల్డ్ మిస్.. ప్రథమేశ్‌‌కు సిల్వర్‌‌

న్యూజీలాండ్ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ స్క్వాడ్ 2023

కేన్ విలియమ్సన్ (సి), విల్ యంగ్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (vc, wk), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్.