హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ధావన్, గిల్ శ్రేయస్..టీమిండియా భారీ స్కోరు

హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ధావన్, గిల్ శ్రేయస్..టీమిండియా భారీ స్కోరు

న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 306  పరుగులు చేసింది. భారత బ్యాట్స్మన్లలో ఓపెనర్లు ధావన్, శుభ్ మన్ గిల్, హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. మిడిలార్డర్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ అర్థసెంచరీతో రాణించాడు. ఇతనికి సంజూ శాంసన్ 36 పరుగులు, సుందర్ 37 పరుగులు చేసి సహకరించడంతో..భారత్ భారీ స్కోరు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. 

శుభారంభం...

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు ఓపెనర్లు  శుభ్‌మన్ గిల్ (50), ధావన్ (77) శుభారంభం అందించారు. ఇద్దరు తొలి వికెట్కు రికార్డు స్థాయిలో 124 పరుగులు జోడించారు. ఇదే క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే అర్థసెంచరీ చేసిన కాసేపటికే గిల్ ఫెర్గూసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత ధావన్  సౌథీ బౌలింగ్‌లో పెవీలియన్ చేరాడు. 

పంత్ మళ్లీ విఫలం...

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, పంత్ కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. దీంతో టీమిండియా 32 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లకు 152 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే ఈ స్థితిలో ఫెర్గూసన్ మరోసారి మాయ చేశాడు. 15 పరుగులు చేసిన పంత్ను ఔట్ చేశాడు. షార్ట్ బాల్ను పుల్ చేయబోయి వికెట్ సమర్పించుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ తొలి బంతికే ఫోర్ బాది మాంచి టచ్ లో ఉన్నట్లు కనిపించాడు. కానీ..ఆ తర్వాత ఫెర్గూసన్ బౌలింగ్లోనే ఫెవీలియన్ చేరాడు. దీంతో భారత్ 4 వికెట్లకు 170 పరుగులతో కష్టాల్లో పడింది. 

శ్రేయస్ అయ్యర్ దూకుడు..

అప్పటికే క్రీజులో కుదుర్కొన్న శ్రేయస్ అయ్యర్..సంజూ శాంసన్తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఐదో వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఇదే క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 36 పరుగులు చేసి శాంసన్ ను మిల్నే ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్.. చిచ్చరపిడుగుల చెలరేగాడు. సిక్సులు, ఫోర్లతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. దీంతో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగుల భారీ స్కోరు సాధించింది.  న్యూజిలాండ్ బౌలర్లలో  ఫెర్గూసన్, సౌథీ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. మిల్నెకు ఓ వికెట్ దక్కింది.