
2026 జనవరిలో న్యూజిలాండ్ తో టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది. ఇందులో భాగంగా కివీస్ తో భారత క్రికెట్ జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఇండియాలో జరగనున్న ఈ సిరీస్ షెడ్యూల్ ను బీసీసీఐ శనివారం (జూన్ 14) ప్రకటించింది. జనవరి 11 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి వన్డే జనవరి 11న వడోదరలో, రెండో వన్డే జనవరి 14న రాజ్‌కోట్ లో, జనవరి 18న మూడో వన్డే ఇండోర్‌లలో జరగనున్నాయి.
వన్డే సిరీస్ ముగిసిన తర్వాత జనవరి 21 నుంచి టీ20 ఫార్మాట్ ప్రారంభం కానుంది. మొత్తం 5 టీ20లకు వరుసగా నాగ్‌పూర్, రాయ్‌పూర్, గౌహతి, వైజాగ్, త్రివేండ్రం ఆతిధ్యం ఇవ్వనున్నాయి. 2026 టీ20 ప్రపంచ కప్ కు ముందు ఈ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ లో బాగా రాణించిన ఆటగాళ్లకు వరల్డ్ కప్ లో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో ఇరు జట్లకు ఈ సిరీస్ చాలా కీలకంగా మారనుంది. ఫిబ్రవరి 2026 లో టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది.
భారత డొమెస్టిక్ లీగ్ షెడ్యూల్ కూడా బీసీసీఐ ప్రకటించింది. దులీప్ ట్రోఫీ ఆగస్టు 28 నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 15న ఫైనల్ మ్యాచ్ తో ఈ లీగ్ ముగుస్తుంది. రంజీ ట్రోఫీని రెండు దశలుగా విభజించారు. మొదటి దశ అక్టోబర్ 15 నుండి నవంబర్ 19 వరకు జరుగుతుంది. రెండవ దశ జనవరి 22, 2026 నుండి ఫిబ్రవరి 1, 2026 వరకు ఉంటుంది. ఫైనల్ ఫిబ్రవరి 28, 2026న జరగనుంది.
50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24 నుంచి జనవరి 18 వరకు జరుగుతుంది. అహ్మదాబాద్, జైపూర్, రాజ్‌కోట్, బెంగళూరు ఈ టోర్నీలో మ్యాచ్ లకు ఆతిథ్యం ఇస్తాయి. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 26న ప్రారంభమై డిసెంబర్ 18న ముగుస్తుంది.
న్యూజిలాండ్, ఇండియా వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్
11 జనవరి, 2026 ఆదివారం మధ్యాహ్నం 1:30 1వ వన్డే బరోడా
14 జనవరి, 2026 బుధవారం మధ్యాహ్నం 1:30 2వ వన్డే రాజ్‌కోట్
18 జనవరి, 2026 ఆదివారం మధ్యాహ్నం 1:30 3వ వన్డే ఇండోర్
21 జనవరి, 2026 బుధవారం రాత్రి 7:00 గం. 1వ టీ20 నాగ్‌పూర్
23 జనవరి, 2026 శుక్రవారం రాత్రి 7:00 గం. 2వ టీ20 రాయ్‌పూర్
25 జనవరి, 2026 ఆదివారం రాత్రి 7:00 గం. 3వ టీ20 గౌహతి
28 జనవరి, 2026 బుధవారం రాత్రి 7:00 గం. 4వ టీ20 వైజాగ్
31 జనవరి, 2026 శనివారం రాత్రి 7:00 గం. 5వ టీ20 త్రివేండ్రం
Here's a look at the schedule for New Zealand's white-ball tour of India, set to take place in early 2026. 🏏🇮🇳🇳🇿#INDvNZ #TeamIndia #Cricket #Sportskeeda pic.twitter.com/URU6ZgxYpj
— Sportskeeda (@Sportskeeda) June 14, 2025