మహిళల టీ20 వరల్డ్ కప్ విశ్వవిజేతగా న్యూజిలాండ్ అవతరించింది. దుబాయ్ ఇంటర్ నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికాపై 32 పరుగుల తేడాతో విజయం సాధించి.. పొట్టి ఫార్మాట్లో నయా ఛాంపియన్‌గా నిలిచింది. తొలిసారి మహిళల టీ20 ప్రపంచ కప్‌ను న్యూజిలాండ్ ముద్దాడింది. కాగా, ఈ ఫైనల్ పోరులొ టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ బ్యాటర్లలో సుజీ బైట్స్ 32, అమేలియా కెర్ 43, బ్రూక్ హాల్లీడే 38 రన్స్ చేశారు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 126 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (33) తప్ప మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. దీంతో న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో విజయం సాధించి.. టీ 20 వరల్డ్ కప్‌ను తొలిసారి కైవసం చేసుకుంది.
ALSO READ | సీఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ : తెలంగాణ 32 జిల్లాల్లో పూర్తి