
జింబాబ్వే, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రారంభమైన రెండో టెస్ట్ రెండున్నర రోజుల్లోనే ముగిసింది. బులవాయో వేదికగా ద క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో ముగిసిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు పసికూన జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. మూడో రోజు 476 పరుగులు వెనకబడి బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే కివీస్ బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ లో 117 పరుగులకే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 359 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కివీస్ జట్టుకు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం.
3 వికెట్ల నష్టానికి 601 పరుగులతో రెండో రోజు ముగించిన న్యూజిలాండ్.. మూడో రోజు ఒక్క ఓవర్ కూడా ఆడకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే ఘోరంగా ఆడింది. నిక్ వెల్చ్ 47 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిస్తే.. మిగిలిన వారు చేతులెత్తేశారు. ఏకంగా 9 మంది సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు చేరడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కివీస్ బౌలర్లలో జకారీ ఫౌల్క్స్ ఐదు పడగొట్టి సత్తా చాటాడు. డఫీ, హెన్రీలకు తలో రెండు వికెట్లు లభించాయి. ఫిషర్ కు ఒక వికెట్ దక్కింది. డెవాన్ కాన్వేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. మాట్ హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.
తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 48.5 ఓవర్లలో 125 రన్స్‌కే ఆలౌటైంది. బ్రెండన్ టేలర్ (44) టాప్ స్కోరర్. టఫాడ్జ్వా సిగా (33 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. మ్యాట్ హెన్రీ (5/40), జకారీ ఫౌల్క్స్ (4/38) బంతితో చచెలరేగి జింబాబ్వేను స్వల్ప స్కోర్ కే పరిమితం చేశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 601 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. నికోల్స్ (150), కాన్వే (153), రచీన్ రవీంద్ర (165) సెంచరీల మోత మోగించారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో కివీస్ కు 476 పరుగుల ఆధిక్యం లభించింది.
ALSO READ : Asia Cup 2025: ఆసియా కప్‌కు మిస్ అవుతున్న నలుగురు టీమిండియా స్టార్ ప్లేయర్లు వీరే!
New Zealand end their tour of Zimbabwe with their biggest ever Test win! 🙌 https://t.co/3sVpRkz5f6 #ZIMvNZ pic.twitter.com/AtQCKlUMmj
— ESPNcricinfo (@ESPNcricinfo) August 9, 2025