ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను కలిసిన కొత్త సర్పంచులు

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను కలిసిన కొత్త సర్పంచులు

సంగారెడ్డి టౌన్: గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ఇరుగుపల్లి, గుంతపల్లి నూతన సర్పంచులు సుప్రియ సతీశ్, అనంతరెడ్డి సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. 

బీఆర్ఎస్​పాలనలో గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందించి  దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ విజయేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నర్సింలు, కొండల్ రెడ్డి ,చక్రపాణి, సందీప్, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.