
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నూతన వధూవరులు తమ పెండ్లిలో ప్రచారం చేశారు. పెండ్లికి వచ్చిన వారికి పాంప్లెంట్స్ పంచి పెడుతూ, కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన బల్సని ప్రణయ్ గౌడ్‌కు రాయికల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన యువతి కీర్తనతో ఆదివారం పెండ్లి జరిగింది.
ఈ వేడుకలో వరుడు ప్రణయ్, వధువు కీర్తన.. కోరుట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నర్సింగరావుకు ఓటు వేయాలని కోరుతూ పాంప్లెంట్స్ పంచి పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో
వైరల్‌గా మారింది.
- మల్లాపూర్, వెలుగు