సాయి పల్లవి సినిమాలు చేయకపోవడానికి రీజన్ ఇదే

సాయి పల్లవి సినిమాలు చేయకపోవడానికి రీజన్ ఇదే

మిగతా  హీరోయిన్ల మాదిరిగా గ్లామర్ షోలు, ఎక్స్‌పోజింగ్‌ చేయకుండా.. నటనకు మాత్రమే ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తూ ముందుకు వెళ్తున్న సహజ నటి సాయి పల్లవి. ‘ఫిదా’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి.. తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తెలంగాణ యాసలో అద్భుతంగా డబ్బింగ్ చెప్పుకొని శభాష్ అనిపించుకున్నారు. గతంలో లవ్ స్టోరీ, విరాటపర్వం, గార్గి వంటి సినిమాల్లో నటించిన సాయి పల్లవి.. ఇప్పుడు ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. దీంతో అభిమానులు ఆమె సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సాయి పల్లవి.. ఇకపై సినిమాల్లో నటించదని, పెళ్లి చేసుకుని ఎంచక్కా డాక్టర్ గా సెటిల్ అవుతుందని ఈ మధ్య పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. సాయిపల్లవి సినిమాలు చేయాలని, మానేయొద్దని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. సాయిపల్లవి సినిమాల్లో నటించడం మానేయలేదట. మంచి స్క్రిప్ట్ కోసమే తాను వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే ఒక మలయాళం మూవీకి సంతకం చేశారని చెబుతున్నారు. మలయాళంలో ప్రేమమ్ అనే మూవీ సాయిపల్లవికి ఫస్ట్ సినిమా. ఈ మూవీలో నటించిన హీరో నివీన్ పౌలితో మళ్లీ సినిమా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.