
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 12వ ఎడిషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి 2023 క్యాలెండర్ ఇయర్‌లో విడుదలైన చిత్రాల నుంచి నామినేషన్లను సైమా చైర్‌పర్సన్ బృందా ప్రసాద్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 14 ,15 తేదీల్లో దుబాయ్‌లో ఈ వేడుక జరగనుందని ప్రకటించారు.
తెలుగులో నాని, కీర్తి సురేశ్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ‘దసరా’ చిత్రం 11 నామినేషన్లతో ముందంజలో ఉండగా, నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘హాయ్ నాన్న’ 10 నామినేషన్లతో ఉంది. ఇక దసరా (తెలుగు), జైలర్ (తమిళం), కాటేరా (కన్నడ), 2018 (మలయాళం) మోస్ట్ పాపులారిటీ చిత్రాల కేటగిరీలలో ముందున్నాయి.