వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు

వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు

హైదరాబాద్: రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే ఐదు రోజులు మధ్యాహ్నం వరకు టెంపరేచర్స్ గరిష్టంగా నమోదవుతూ.. మధ్యానం 2 గంటల తర్వాత మేఘా వృతమై ఉరుములు మెరుపులతో  వర్షాలు పడతాయంటున్నారు అధికారులు. దక్షిణ తెలంగాణ జిల్లాలు అలర్ట్స్ గా ఉండాలని తెలిపారు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి. వ‌ర్షాలు కురిసే టైమ్ లో మెరుపులు, ఉరుములతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావార‌ణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి నుంచే వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఉక్కపోత నుంచి కాస్త రిలీఫ్ పొందే అవకాశం ఉందంటున్నారు నగరవాసులు.