ఓబెన్ ఎలక్ట్రిక్ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్..రోర్ ఈజీ సిగ్మా వచ్చేసింది

ఓబెన్ ఎలక్ట్రిక్ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్..రోర్ ఈజీ సిగ్మా వచ్చేసింది

ఓబెన్ ఎలక్ట్రిక్, తన సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైకిల్ 'రోర్ ఈజీ సిగ్మా'ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధర పరిమిత కాల ఆఫర్ మాత్రమే. 

ఈ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 3.4 కిలోవాట్​ బ్యాటరీ ప్యాక్ ధర రూ.1.27 లక్షలు కాగా,  4.4 కిలోవాట్​బ్యాటరీ ప్యాక్ ధర రూ.1.37 లక్షలు.  ఈ బైక్ గంటకు గరిష్టంగా 95 కి.మీ. వేగంతో వెళ్తుంది. 3.4 కిలోవాట్ వేరియంట్​ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ. వరకు, 4.4 కిలోవాట్ వేరియంట్ 175 కి.మీ. వరకు ప్రయాణించగలదు. 

డిజైన్, ఫీచర్లలో మార్పులు:

రోర్ EZ సిగ్మాలో బాగా ఆకట్టుకుంటున్నది సీటు డిజైన్. ఇది సుదూర ప్రయాణాల్లో మెరుగైన కంఫర్ట్‌ను అందిస్తుంది. పదునైన కట్‌లు, ఫోల్డింగ్స్ తో పాటు గుండ్రని హెడ్‌ల్యాంప్‌తో స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంది. ఈసారి ఒబెన్ కొత్త ఎలక్ట్రిక్ ఎరుపు రంగుతో కొత్త గ్రాఫిక్ డిజైన్‌ను పరిచయం చేసింది. ఫోటాన్ వైట్, ఎలక్ట్రో అంబర్, సర్జ్ సియాన్ వంటి కలర్ ఆప్షన్ ఉంది.