Paytm యూజర్లకు NHAI హెచ్చరిక: కొత్త FASTag తీసుకోవాలి.. లేకుంటే జరిమానా

Paytm యూజర్లకు NHAI హెచ్చరిక: కొత్త FASTag తీసుకోవాలి.. లేకుంటే జరిమానా

Paytm  యూజర్లు కొత్త FASTag తీసుకోవాలని నేషలన్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI ) కోరింది. మార్చి 15 లోపు వినియోగదారులు మరో బ్యాంకు నుంచి జారీ చేసిన కొత్త ఫాస్టాగ్ ను కొనుగోలు చేయాలని సూచించింది. లేకుంటే జరిమానా తప్పదని హెచ్చరించింది. ఆర్బీఐ పేటీఎం పేమెంట్ బ్యాంకు పై నిషేధం తర్వాత Paytm FASTags  వినియోగదారులు మార్చి 15 తర్వాత బ్యాలెన్స్ రీఛార్జ్  చేయడం కుదరదు. కాబట్టి వేరొక బ్యాంకు నుంచి కొత్త ఫాస్టాగ్ ను పొందాలని సూచించింది. ఒకవేళ బ్యాలెన్స్ ఉంటే మార్చి 15 తర్వాత కూడా ఉపయోగించుకోవచ్చు తెలిపింది. 

Paytm పేమెంట్స్ బ్యాంకు లావాదేవీలపై RBI  నిషేధం విధించిన విషయం తెలిసిందే.. 2024 ఫిబ్రవరి 16న పేటీఎం  పేమెంట్స్ బ్యాంకు పై నిషేధం విధించింది. టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా నివారించాలంటే.. మార్చి 15 లోపు మరొక బ్యాంకు నుంచి కొత్త ఫాస్టాగ్ ను పొందాలని NHAI ..Paytm ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు సూచించింది. 

Paytm ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు వారి సంబంధిత బ్యాంకులను సంప్రదించాలని లేదా IHMCL(ఇండియన్ హైవే మెనేజ్ మెంట్ కంపెనీ లిమిటెడ్ ) వెబ్ సైట్ లో అందించిన FAQ లను చూడాలని సలహా ఇచ్చింది.