హైవే పక్కన రెస్టారెంట్ నడపాలంటే లంచం ఇవ్వాలా..? రూ. లక్ష డిమాండ్ చేస్తూ.. సీబీఐ వలకు చిక్కిన NHAI అధికారి..

హైవే పక్కన రెస్టారెంట్ నడపాలంటే లంచం ఇవ్వాలా..? రూ. లక్ష డిమాండ్ చేస్తూ.. సీబీఐ వలకు చిక్కిన NHAI అధికారి..

హైవే పక్కన డాబాలు, రెస్టారెంట్లు, హోటళ్లు ఉండటం కామనే.. ప్రతి హైవే పక్కన చిన్న పాన్ డబ్బా, టీ స్టాల్ దగ్గర నుంచి టిఫిన్ సెంటర్లు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు కచ్చితంగా ఉంటాయి.. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. అయితే.. హైవే పక్కన రెస్టారెంట్ నడపాలంటే లంచం ఇవ్వాల్సి వస్తుందని ఎప్పుడైనా విన్నారా.. అవును హైదరాబాద్ - యాదాద్రి రూట్ లో ఉన్న ఓ రెస్టారెంట్ యజమాని నుంచి రూ. లక్ష డిమాండ్ చేశారు హైదరాబాద్ నేషనల్ హైవే అథారిటీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

బీబీనగర్ టోల్ ప్లాజా పక్కన ఉన్న ఓ రెస్టారెంట్ యజమాని నుంచి లంచం డిమాండ్ చేశారు NHAI అధికారి దుర్గాప్రసాద్. రెస్టారెంట్ నడుపుకోవాలంటే తనకు రూ. లక్ష సమర్పించుకోవాల్సిందే అంటూ కండిషన్ పెట్టారు సదరు అధికారి. దీంతో సీబీఐని ఆశ్రయించారు బాధితుడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా... దుర్గాప్రసాద్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ALSO READ : ప్రీపెయిడ్ యూజర్లకు బిగ్ షాక్ !

దుర్గాప్రసాద్ ను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు హైదరాబాద్, వరంగల్, సదాశివపేటలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడి డబ్బులు ఇవ్వద్దని... తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు అధికారులు.