Airtel Vs Jio: మంత్లీ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే ఎయిర్టెల్, జియో ప్రీపెయిడ్ యూజర్లకు బిగ్ షాక్ !

Airtel Vs Jio: మంత్లీ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే ఎయిర్టెల్, జియో ప్రీపెయిడ్ యూజర్లకు బిగ్ షాక్ !

2024 జులైలో టారిఫ్లను భారీగా పెంచి యూజర్లకు షాకిచ్చిన ఎయిర్ టెల్, జియో కంపెనీలు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. 24 రోజుల వ్యాలిడిటీతో.. అపరిమిత వాయిస్ కాల్స్తో పాటు రోజుకు 1 జీబీ డేటా ప్రొవైడ్ చేసిన రీఛార్జ్ ప్లాన్కు ఎయిర్ టెల్, జియో కంపెనీలు మంగళం పాడాయి. ఇవాల్టి(ఆగస్ట్ 20, 2025) నుంచి ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలో 249 రూపాయల ప్లాన్ కనిపించదు. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ బేసిక్ ప్లాన్లలో ఈ 249 రూపాయల ప్లాన్ పాపులర్.

ఎయిర్ టెల్ ఇన్నాళ్లూ ఈ 249 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లో రోజుకు 1 జీబీ డేటాతో పాటు.. అపరిమిత వాయిస్ కాల్స్ 24 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. ఆగస్ట్ 20 నుంచి.. అంటే ఇవాల్టి నుంచి ఈ ప్లాన్ తొలగించినట్లు ఎయిర్ టెల్ స్పష్టం చేసింది. అంతేకాదు.. ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ ఎంట్రీ లెవెల్ ప్లాన్ 299 రూపాయల రీఛార్జ్ ప్లాన్ నుంచి అందుబాటులో ఉంది. 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 1 జీబీ డేటా కావాలంటే ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ యూజర్లు రూపాయి తక్కువ 3 వందలు సమర్పించుకోవాల్సిందే.

ALSO READ : క్రిప్టోలో పెర్పెట్యూయల్ ఫ్యూచర్స్ అంటే ఏమిటి?

ఓటీటీ కంటెంట్ వీక్షించే యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అదెలా అంటే.. ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ సబ్ స్క్రిప్షన్ కూడా ఈ 299 రూపాయల ప్లాన్తో పాటు ఎయిర్ టెల్ అందిస్తోంది. 30 రోజుల పాటు హలోట్యూన్స్ సబ్ స్క్రిప్షన్, 12 నెలల పాటు పర్ప్లెక్సిటీ ప్రో సబ్ స్క్రిప్షన్ కూడా 299 రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే పొందొచ్చు. రిలయన్స్ జియో 249 రూపాయల ప్లాన్ను ఎత్తేసిన రోజుల వ్యవధిలోనే ఎయిర్ టెల్ కూడా అదే బాటను ఎంచుకోవడం గమనార్హం.

జియోలో కూడా 299 రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటేనే రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ వర్తిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 1జీబీ లేదా 1.5 జీబీ ప్లాన్ పొందాలంటే ఎయిర్ టెల్, జియో ప్రీపెయిడ్ యూజర్లు ఇకపై మినిమమ్ 299 రూపాయలు ఖర్చు చేయక తప్పదు.