క్రిప్టోలో పెర్పెట్యూయల్ ఫ్యూచర్స్ అంటే ఏమిటి? ఇన్వెస్టర్లకు వీటితో ఎన్ని లాభాలో తెలుసా..?

క్రిప్టోలో పెర్పెట్యూయల్ ఫ్యూచర్స్ అంటే ఏమిటి? ఇన్వెస్టర్లకు వీటితో ఎన్ని లాభాలో తెలుసా..?

Perpetual Futures: ప్రముఖ క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ ఇటీవల వరుసగా ఆల్ టైం గరిష్ఠ ధరలకు పెరుగుతున్న క్రమంలో చాలా మంది క్రిప్టో ఇన్వెస్ట్మెంట్లపై ఆసక్తిని పెంచుకుంటున్నారు. అసలు క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏఏ మార్గాలు ఉన్నాయని అన్వేషిస్తున్నారు. వేలు లక్షల్లో పెట్టుబడి పెట్టలేకపోయినప్పటికీ కనీసం 100 రూపాయలతో కూడా ఇన్వెస్టమెంట్ స్టార్ట్ చేయాలనుకునే వారి కోసం కూడా కొన్ని మార్గాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో క్రిప్టోల్లో ఎస్ఐపీ పెట్టుబడులతో పాటు క్రిప్టోలో పెర్పెట్యూయల్ ఫ్యూచర్స్ ఎక్కువగా ప్రజాధరణను చూస్తున్నాయి. 

అసలు పెర్పెట్యూయల్ ఫ్యూచర్స్ అంటే ఏంటి..?
పెర్పెట్యూయల్ ఫ్యూచర్స్ అంటే క్రిప్టో కరెన్సీ ధరపై బెట్ వేసే ఒక ప్రత్యేకమైన ఒప్పందం. దీనికి మామూలు ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో మాదిరిగా ఎక్స్‌పెయిరీ తేదీ ఉండదు. అంటే ట్రేడర్లు తమ పొజిషన్స్ ఎప్పటికి కావాలనుకున్నా ఉంచుకోవచ్చు. సాధారణ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు ఒక నిర్దిష్ట తేదీకి ముగుస్తాయి. ఈ విధానంలో పైసా కూడా పెట్టకుండానే క్రిప్టో ధరపై లాభాలు పొందవచ్చు. ధర పెరుగుతుందంటే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, తగ్గుతుందంటే షార్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్టర్లు. అలాగే లివరేజ్ కారణంగా చిన్న మెుత్తంతో కూడా పెద్ద ట్రేడ్స్ చేయెుచ్చు. దీన్ని ఉపయోగించి సొంత క్రిప్టో ఎప్పటికప్పుడు అమ్మకుండా, మార్కెట్ లో ఉన్న ప్రమాదం నుంచి రక్షణ పొందవచ్చు.

ALSO READ : ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త!

భారతదేశంలోని కొన్ని క్రిప్టో ఏజెన్సీలు మాత్రమే ప్రస్తుతం ఈ  పెర్పెట్యూయల్ ఫ్యూచర్స్ క్రిప్టో ట్రేడర్లకు ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో జియోటస్ క్రిప్టో ఎక్స్ఛేంజీ కూడా చేరింది. లాంచ్ ఆఫర్ కింద సెప్టెంబర్ 30, 2025 వరకు ట్రేడింగ్ పై ఎలాంటి ఛార్జీలు కూడా లేకుండా అవకాశాన్ని కల్పించిందని సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ చెప్పారు. అలాగే ఇన్వెస్టర్లు కనీసం రూ.100తో తమ ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేయెుచ్చని ఆయన చెబుతున్నారు.