ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త! టెక్కీలకు జూన్ క్వార్టర్ బోనస్ చెల్లింపు.. ఎంతంటే..?

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త! టెక్కీలకు జూన్ క్వార్టర్ బోనస్ చెల్లింపు.. ఎంతంటే..?

Infosys Bonus Pay: బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించిన ఉద్యోగులకు పనితీరు ఆధారంగా బోనస్ ను ప్రకటించింది. ఈసారి సంస్థవ్యాప్తంగా సగటు బోనస్ 80%గా నిర్ణయించింది కంపెనీ. దీపావళికి ముందు ఇది ఉద్యోగులకు ఎంతో ఊరటనిచ్చే వార్తగా చెప్పుకోచ్చు. ఎందుకంటే గత త్రైమాసికంలో సగటు బోనస్ 65% మాత్రమే చెల్లించింది ఇన్ఫోసిస్. ఈసారి మెరుగైన పనితీరుతో పాటు ఉద్యోగులకు మరింత ప్రోత్సాహకరమైన బోనస్ చెల్లిస్తోంది టెక్ దిగ్గజం.

పనితీరు బోనస్ ను ఉద్యోగుల రేటింగ్, స్థాయి ఆధారంగా వేరువేరుగా ఉంటాయి. PL4 స్థాయిలో, “అత్యుత్తమం” (Outstanding) గా రేటింగ్ పొందిన వారికి 89% బోనస్ లభించగా.. “Needs Attention” కేటగిరీలో ఉన్నవారికి 80% బోనస్ ఇస్తోంది ఇన్ఫోసిస్. అదే సమయంలో PL5 స్థాయిలో బోనస్ శాతం 78% నుంచి 87% మధ్యలో ఉండగా, PL6 స్థాయి ఉద్యోగులకు 75% నుంచి 85% మధ్య బోనస్ ఇవ్వాలని కంపెనీ నిర్ణయించిందని వెల్లడైంది. ఉద్యోగి ఉద్యోగికీ రేటింగ్ ఆధారంగా బోనస్ శాతం మారుతుందని.. కానీ అందరికీ కనీసం 75% పైగా బోనస్ అందేలా చూస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ALSO READ : AIతో మానవజాతికి ప్రమాదమే.. 

ఈ బోనస్ లు ప్రధానంగా బ్యాండ్ 6, దీని కంటే తక్కువ స్థాయిలలో పనిచేస్తున్న ఉద్యోగులుకి వర్తిస్తాయి. అంటే కంపెనీలోని జూనియర్ నుంచి మిడ్-లెవెల్ ఉద్యోగులు ఈ బోనస్ పొందనున్నారు. ఉద్యోగులకు వచ్చే బోనస్ గురించిన వివరాలను సంస్థ వారికి ఇప్పటికే పంపినట్లు తెలుస్తోంది. మెుదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.6వేల 921 కోట్లుగా ఉండగా ఆదాయం రూ.42వేల 279 కోట్లుగా నమోదైంది. మార్కెట్లు ఊహించిన దానికంటే ఉత్తమ పనితీరు కనబరిచిన కంపెనీ ఇప్పుడు బోనస్ చెల్లింపుల్లో కూడా అదే దూకుడును కొనసాగిస్తోంది. దీనికి ముందు టీసీఎస్ కూడా తమ ఉద్యోగులకు బోనస్ చెల్లింపుల గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే.