
న్యూఢిల్లీ, వెలుగు: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఈనెల 28, 29 తేదీల్లో తెలంగాణకు చెందిన 109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులను విచారించేందుకు హైదరాబాద్‌లో రెండు రోజులు పాటు ప్రత్యేక బహిరంగ విచారణ (ఓపెన్ హియరింగ్) చేపట్టనుంది. ఈ మేరకు శనివారం ఎన్‌హెచ్ఆర్‌సీ ప్రకటన వెలువరించింది.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్, సభ్యులు జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి, విజయ భారతి సయానీ ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఫిర్యాదుదారులు, సంబంధిత రాష్ట్ర అధికారుల సమక్షంలో కేసులను విచారించనున్నారు.