భారత హైకమిషన్‌పై దాడి కేసు..కీలకనిందితుడిపై NIA చార్జీషీటు

భారత హైకమిషన్‌పై దాడి కేసు..కీలకనిందితుడిపై NIA చార్జీషీటు

న్యూఢిల్లీ: 2023లో లండన్‌లోని భారత హైకమిషన్‌ పై జరిగిన దాడికేసులో NIA కీలక అప్డేట్..గురువారం(సెప్టెంబర్5,2024) కీలక నిందితుడిపై చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.

ఖలిస్తానీ వేర్పాటువాద ఎజెండాతో మార్చి 22, 2023న లండన్ లోని భారత హైకమిషన్ ముందు ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనకు కీలకసూత్రధారి.. హౌన్‌స్లోలో నివసిస్తున్న UK జాతీయుడు.. న్యూఢిల్లీకి చెందిన ఇందర్‌పాల్ సింగ్ పై ఎన్ఐఏ చార్జ్షీట్ దాఖలు చేసింది. 

ఖలిస్తానీ వేర్పాటువాద కార్యక్రమాల్లో సింగ్ ది కీలకపాత్ర అని సమగ్ర దర్యాప్తు తర్వాత నిర్ధారించిన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఏప్రిల్ 25 న నిందితుడిని అరెస్టు చేసింది. అతనిపై లుకౌట్ సర్క్యులర్ జారిచేసిన NIAఅధికారులు..లండన్ నుంచి పాకిస్తాన్ మీదుగా రాగానే అట్టారీ సరిహద్దు వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు డిసెం బర్ 2023లో అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత గాబాపై దర్యాప్తు ప్రారంభించి విచారణ చేపట్టారు. నెలరోజుల విచారణలో NIA అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుంది.సంఘటనకు సంబంధిం చిన అనేక నేరారోపణలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలతో సహా డేటాను పరిశీలించింది. ఈ సంఘటనలో సింగ్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో అతడిపై ఛార్జీ షీట్ దాఖలు చేసింది. 

వారిస్‌ పంజాబ్‌ దే చీఫ్‌ అమృతపాల్‌ సింగ్‌పై పంజాబ్‌ పోలీసులు తీసుకున్న చర్యకు ప్రతీకారంగా లండన్‌లో దాడికి కుట్రపన్నారని.. ఆ సంస్థపై అణిచివేత ఆరోపణలతో ఈ దాడికి పాల్పడ్డారని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. హైకమిషన్ వద్ద హింసాత్మక దాడి భారతదేశం నుంచి  పంజాబ్ రాష్ట్రాన్ని వేరు చేయడం ద్వారా ఖలిస్తాన్ వాదాన్ని  మరింత ముందుకు తీసుకెళ్లడం , సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.