హైదరాబాద్, వెలుగు: కర్రెగుట్టల్లో మావోయిస్టుల మందుగుండు సామగ్రి, ఆయుధాలు సహా రాష్ట్రంలో నమోదైన మూడు వేర్వేరు కేసుల్లో సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన మొత్తం 21 మందిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. కుంజం లక్కా, మరిగల సుమతి, కర్తం జోగా, కర్తం భీమా, హేమల సుక్కి సహా 20 మందితో పాటు పరారీలో ఉన్న మరో వ్యక్తిపై నాంపల్లిలోని ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టులో మూడు వేర్వేరు చార్జిషీట్లు ఫైల్ చేసింది.
వీరిపై అప్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా), ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం సహా బీఎన్‌ఎస్‌ఎస్‌లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. కర్రెగుట్టలను సురక్షిత స్థావరంగా మార్చుకుని.. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సీపీఐ(మావోయిస్ట్) పార్టీ ప్రయత్నించిందని చార్జిషీట్‌లో పేర్కొంది.
