బీహార్ రైల్వేస్టేషన్ పేలుళ్లతో హైదరాబాద్ కు లింక్

బీహార్ రైల్వేస్టేషన్ పేలుళ్లతో  హైదరాబాద్ కు లింక్

బీహార్ రైల్వేస్టేషన్ పేలుళ్లలో హైదరాబాద్ కు సంబంధాలున్నట్లు గుర్తించింది ఎన్ఐఏ. బీహార్ దర్భంగా రైల్వేస్టేషన్ లో ఈ నెల 17న బాటిల్ పేలుడు జరిగింది. స్టేషన్ లోని ఓ పార్శిల్ లో పేలుడు సంభవించింది. ఈ పార్శిల్..  సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బీహార్ కు వచ్చినట్లు గుర్తించారు అధికారులు. మహ్మద్ సుఫియన్ పేరుతో పార్శిల్ వచ్చినట్లు తెలిపారు. పేలుళ్లలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ కేసును బీహార్ ఏటీఎస్, ఎన్ఐఏ కలిపి కేసు దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. ఇందులో హైదరాబాద్ అసిఫ్ నగర్ లో ఉంటున్న ఇద్దరు అనుమానితుల్ని.. మొన్నరాత్రి అరెస్ట్ చేశారు అధికారులు. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐకి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.