
సినీ నటి వరలక్ష్మి శరత్‌కుమార్(Varalakshmi Sarathkumar )కు కొచ్చి ఎన్ఐఏ(NIA) అధికారుల నోటీసులు జారీ చేశారు. కొన్నేళ్లుగా వరలక్ష్మి దగ్గర పీఏగా పనిచేస్తున్న ఆదిలింగం(Adhilingam) డ్రగ్స్ కేసులో కీలక నిందితులలో ఒకరిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతనికి చాలా మంది డ్రగ్స్ స్మగ్లర్లతో సంబంధాలునట్లు పోలీసులకు పక్కా ఆధారాలు లభించడంతో.. అధికారులు ఆదిలింగంను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఈ క్రమంలోనే డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని సినీ పరిశ్రమలో ఇన్వెస్ట్ చేసినట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాల తెలుసుకునేందుకు విచారణ కోసం నటి వరలక్ష్మికి సమన్లు జారీచేశారు ఎన్ఐఏ అధికారులు. అంతేకాదు.. వరలక్ష్మికి కూడా అదిలింగం అనేకసార్లు డ్రగ్స్ ఇచ్చినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.
ఇంకా కోలీవుడ్‌లో ఎవరెవరు ఆదిలింగం టచ్‌లో ఉన్నారు, వారికి కూడా అతను డ్రగ్స్ సప్లై చేశాడా అని తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకోవడానికే వరలక్ష్మికి సమన్లు జారీచేశారు అధికారులు. ఈ సంఘటనతో కోలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.