జైలు నుంచి తీవ్రవాదుల పరారీ కేసు: 7 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

జైలు నుంచి తీవ్రవాదుల పరారీ కేసు: 7 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి లష్కరే తోయిబా తీవ్రవాదులు పరారీ కేసులో దేశవ్యాప్తంగా సోదాలు చేస్తోంది NIA. 2024, మార్చి 5వ తేదీ మంగళవారం ఉదయం ఢిల్లీ, ముంబయి, కర్ణాటక, తమిళనాడు, తెలగాణతోపాటు మరో రెండు రాష్ట్రాలలో 17 చోట్ల నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. 2013లో బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి పరారయ్యారు తీవ్రవాదులు. ఈ కేసులో గతేడాది అనుమానితుల ఇండ్లల్లో సోదాలు చేయగా.. భారీగా ఆయుధాలను గుర్తించారు NIA అధికారులు.  

2023, జులైలో లష్కరే తోయిబా తీవ్రవాది నజీర్ భావజాలానికి ఆకర్షితులై పనిచేస్తున్న ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 7 పిస్తోళ్లు, 4  హ్యాండ్ గ్రానేడ్లు, 45 లైవ్ రౌండ్లు, 4 వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బెంగళూరు పోలీసులు..  ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించారు.  ఈ కేసు దార్యప్తులో భాగంగా..2024, జనవరిలో ఛార్జిషీటు దాఖలు చేసిన NIA అధికారులు... నిందితులకు పలు కేసుల్లో తీవ్రవాద సంస్థలతో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు.