
కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదుల సంబంధమున్న పలువురు అనుమానితులను ఎన్ఐఏ, పోలీసు అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆదివారం రోజు కూడా నగరంలో సోదాలు చేసిన ఎన్ఐఏ అధికారులు ఓ యువతిని అరెస్ట్ చేశారు. ఆమెను మహారాష్ట్ర వార్ధాకు చెందిన మైమునగా గుర్తించారు. మరో ఆసక్తికర విషయమేమిటంటే ఆ యువతి ఐసిస్ సానుభూతిపరుడు అబ్దుల్ బాసిత్ భార్యగా తెలిసింది. ఇప్పటికే పోలీసులు అబ్దుల్ బాసిత్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.