నర్సింగ్‌ స్టూడెంట్ రిక్రూట్‌మెంట్‌ కేసులో విచారణ

నర్సింగ్‌ స్టూడెంట్ రిక్రూట్‌మెంట్‌ కేసులో విచారణ

హైదరాబాద్/వరంగల్‍, వెలుగు: చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నేతల ఇండ్లలో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) సోమవారం సోదాలు చేసింది. హైదరాబాద్‌ విద్యానగర్‌‌లోని సీఎమ్‌ఎస్‌ కన్వీనర్‌‌ జ్యోతి ఇంటితో పాటు హనుమకొండలోని సంఘం మెంబర్, గవర్నమెంట్ టీచర్ అనిత ఇంట్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది.

ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరంలోని సభ్యుల ఇండ్లలో కూడా సోదాలు చేసింది. విశాఖకు చెందిన నర్సింగ్ స్టూడెంట్ రాధను కిడ్నాప్ చేసి మావోయిస్ట్‌ కమిటీలో రిక్రూట్‌ చేశారన్న ఆరోపణలతో ఈ ఏడాది మే 31న ఎన్‌ఐఏ కేసు రిజిస్టర్ చేసింది. దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం అనుమానితుల ఇండ్లలో సోదాలు నిర్వహిస్తోంది. సోమవారం మూడు ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో కీలక ఆధారాలు సేకరించింది.