గుజరాత్ డ్రగ్స్ కేసులో రంగంలోకి ఎన్ఐఏ!

గుజరాత్ డ్రగ్స్ కేసులో రంగంలోకి ఎన్ఐఏ!

గుజరాత్: గుజరాత్‎లో వారం కింద భారీగా డ్రగ్స్ దొరికిన విషయం తెలిసిందే. ఆ డ్రగ్స్ కేసును విచారించేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగనుంది. ఈ డ్రగ్స్ కేసు అనేక రాష్ట్రాలతో పాటు ముఖ్యులతో ముడిపడి ఉన్నందున దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కాగా.. ఎన్‎ఫోర్స్‎మెంట్ అధికారులు ఇప్పటికే  మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలోని ఆషి ట్రేడింగ్ కంపెనీ కేంద్రంగా డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు దర్యాప్తులో వెల్లడయింది. దాంతో ఆషి సంస్థ నిర్వహకులు సుధాకర్, వైశాలిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుజరాత్‎లో విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆషి పేరు మీదనే దేశంలోకి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల సరఫరా జరిగిందని వెల్లడైనట్లు సమాచారం.

For More News..

రైతుల భూములు కొట్టేసేందుకు బాల్క సుమన్ కుట్రలు చేస్తున్నడు

డాక్టర్ లేడని నర్సుల వైద్యం.. పుట్టిన పసికందు మృతి

కేసీఆర్ ఢిల్లీ టూర్ల వెనక మతలబేంది.?