భూములు కొట్టేసేందుకు బాల్క సుమన్ కుట్రలు చేస్తున్నడు

భూములు కొట్టేసేందుకు బాల్క సుమన్ కుట్రలు చేస్తున్నడు

హైదరాబాద్: కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేశారని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు బాధితులతో కలిసి ఆయన గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. బ్యాక్ వాటర్‎తో మూడేళ్లుగా వేలాది ఎకరాల్లో పంట నష్టం జరుగుతోందని వివరించారు. పంట మునగడంతో చెన్నూరు‎కు చెందిన యువ రైతు రాజేష్ నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది కూడా ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు. కమీషన్ల కోసం ప్రాజెక్టును రీడిజైన్ చేసి.. రూ.36 వేల కోట్ల ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పెంచారని ఆయన చెప్పారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. మల్లన్నసాగర్ దాకా వెళ్లినవి కాళేశ్వరం నీళ్లు కావని, అవి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీళ్లని వివేక్ అన్నారు. బ్యాక్ వాటర్‎తో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఆయన కోరారు. ఎకరాకు రూ. 50 వేల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల భూములు కొట్టేసేందుకు బాల్క సుమన్ కుట్రలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.

For More News..

డాక్టర్ లేడని నర్సుల వైద్యం.. పుట్టిన పసికందు మృతి

కేసీఆర్ ఢిల్లీ టూర్ల వెనక మతలబేంది.?