డాక్టర్ లేడని నర్సుల వైద్యం.. పుట్టిన పసికందు మృతి

V6 Velugu Posted on Sep 25, 2021

మహబూబ్‎నగర్: జిల్లా కేంద్రంలో దారుణం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ లేకపోవడంతో.. గర్భవతికి నర్సులు డెలివరీ చేశారు. వైద్యం వికటించడంతో అప్పుడే పుట్టిన పసికందు చనిపోయింది. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని వీక్ష ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కరోనా సమయంలో బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు వసూల్ చేసినట్లు ఈ ఆస్పత్రిపై ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజా ఘటనతో మరోసారి ఈ ఆస్పత్రి మీద చర్చ జరుగుతోంది. నర్సుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు. కాగా.. ఆ హాస్పిటల్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించడం గమనార్హం.

For More News..

కేసీఆర్ ఢిల్లీ టూర్ల వెనక మతలబేంది.?

Tagged Telangana, mahaboobnagar, newborn baby died, veeksha hospital

Latest Videos

Subscribe Now

More News