మైథాలజీ థ్రిల్లర్తో వస్తున్న నిధి అగర్వాల్

మైథాలజీ థ్రిల్లర్తో  వస్తున్న నిధి అగర్వాల్

గ్లామర్ హీరోయిన్‌‌గా పేరుతెచ్చుకున్న  నిధి అగర్వాల్ తాజాగా ఓ మైథాలజీ థ్రిల్లర్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె లీడ్‌‌ రోల్‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘తంత్ర’ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. వారాహ్  ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌పై  సునీత్ పడోల్కర్ నిర్మిస్తున్నారు. 

సోమవారం నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ  చిత్రాన్ని పూజా  కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో  నిధి అగర్వాల్ లుక్ చాలా ఇంటరెస్టింగ్‌‌గా  ఉండటంతో పాటు, ఆమెను ఇప్పటివరకు చూడని సరికొత్త అవతార్‌‌లో పరిచయం చేస్తున్నట్లు కనిపిస్తోంది.  

పవర్‌‌ఫుల్, థ్రిల్లింగ్ కథతో మైథలాజికల్ థ్రిల్లర్‌‌‌‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.