చేనేత కళాకారులతో నిఫ్ట్​ స్టూడెంట్ల జోడీ

చేనేత కళాకారులతో నిఫ్ట్​ స్టూడెంట్ల జోడీ

హైదరాబాద్​, వెలుగు: చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి నేషనల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్​)​ చేపట్టిన  క్లస్టర్ ఇనీషియేటివ్​లో భాగంగా సంస్థ స్టూడెంట్లు కొందరు నారాయణపేట చీరాల క్లస్టర్​ను సందర్శించారు. 

అక్కడి కళాకారుల నైపుణ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పరిశోధనల కోసం వివరాలు సేకరించారు.  కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా సంప్రదాయ చేనేత కళాకారులను సత్కరిస్తోంది. ఇందుకోసం  స్టూడెంట్లు భారతదేశంలోని 75 క్లస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో కళాకారులతో,  నేత కార్మికులతో కలిసి పనిచేస్తున్నారు.