వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ క్వార్టర్స్లోకి నిఖత్

వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ క్వార్టర్స్లోకి నిఖత్

లివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: తెలంగాణ బాక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెండుసార్లు వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిఖత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం (సెప్టెంబర్ 09) జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 51 కేజీ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిఖత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5–0తో యునా నిషినక (జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై గెలిచింది. 

బౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దూకుడుగా ఆరంభించిన నిఖత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే రెండు బలమైన హుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టింది. రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అద్భుతమైన ల్యాండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను విసిరింది. చివరి మూడు నిమిషాల్లోనూ నిఖత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోరు కొనసాగినా.. నిషినక పదేపదే హోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిఖత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. బుస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకిరోగ్లు (టర్కీ)తో తలపడనుంది. 

48 కేజీ ప్రి క్వార్టర్స్‌‌‌‌లో మీనాక్షి 5–0తో చైనా బాక్సర్  క్వియుంగ్‌‌‌‌పై గెలిచి క్వార్టర్స్‌‌‌‌ చేరగా. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 80 కేజీ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లక్ష్య చహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 0–3తో సీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యోజ్రిలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడిపోయాడు.