
లివర్‌పూల్: ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. గాయం కారణంగా గత ఆగస్టు నుంచి ఇంటర్నేషనల్ పోటీలకు దూరంగా ఉన్న నిఖత్ తన రీఎంట్రీని ఘనంగా చాటుకుంది. శనివారం జరిగిన విమెన్స్ 51 కేజీ తొలి రౌండ్ బౌట్‌లో జరీన్ 5–0తో అమెరికాకు చెందిన జెన్నిఫర్ లొజానోను చిత్తుగా ఓడించి ప్రి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది.
బౌట్ ప్రారంభంలో నిఖత్ కొంచెం నిదానంగా కనిపించినా, ఆ తర్వాత వేగం పెంచి ప్రత్యర్థిని పూర్తి నియంత్రణలోకి తీసుకుంది. పదునైన పంచ్‌లు కొట్టి ఈజీగా గెలిచింది. కానీ, 75 కేజీ విభాగంలో టాప్ సీడ్‌గా, భారీ అంచనాలతో దిగిన లవ్లీనా బొర్గొహైన్ 0–-5 తో టర్కీ బాక్సర్ బుస్రా ఇసిల్డార్ చేతిలో ఓడి నిరాశపరిచింది. మెన్స్ 90 ప్లస్ కేజీ కేటగిరీలో నరేందర్ బెర్వాల్ 4–1తో క్రిస్టోఫర్ (ఐర్లాండ్)పై నెగ్గి ముందంజ వేయగా, 70 కేజీ తొలి రౌండ్‌లో యువ బాక్సర్ హితేష్ గులియా ఓడిపోయాడు.