సీఎం జగన్ ను కలిసిన కర్ణాటక సీఎం కొడుకు నిఖిల్

సీఎం జగన్ ను కలిసిన కర్ణాటక సీఎం కొడుకు నిఖిల్

ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖులు కలుస్తున్నారు. కొత్తగా సీఎంగా పగ్గాలు తీసుకున్న జగన్ ను కలిసి శుభాకాంక్షలు అందజేస్తున్నారు. సీఎం జగన్ ను ఇవాళ కర్ణాటక సీఎం కుమార స్వామి కుమారుడు నిఖిల్ గౌడ కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జగన్ ను అభినందించారు.

నిఖిల్ గౌడ.. పలు సినిమాల్లో నటిస్తున్నాడు. తెలుగు-కన్నడ సినిమా జాగ్వార్ తో తెరకు పరిచయం అయ్యారు.