టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ(Nikhil Siddarth) తండ్రి కాబోతున్నారు. తాజాగా ఆయన భార్య పల్లవి(Pallavi) సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు నిఖిల్. ఈ వేడుక ఫోటోలను షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు నిఖిల్.
నా భార్య పల్లవికి భారతీయ సంప్రదాయ ప్రకారం సీమంతం వేడుక జరిగింది. మేము త్వరలోనే మా మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు అందజేయండి.. అంటూ పోస్ట్ చేశారు నిఖిల్. దీంతో నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Seemantham .. Traditional Indian form of BabyShower.. Pallavi & Me r happy to announce that Our first baby is expected very soon ???? Please send in your blessings ??? pic.twitter.com/3Nn4S3wFHv
— Nikhil Siddhartha (@actor_Nikhil) January 31, 2024
ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో స్వయంభూ అనే హిస్టారికల్ మూవీలో నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో హీరో నిఖిల్ఓ యుద్ధ వీరుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నిఖిల్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.