Rise of Swayambhu: ‘స్వయంభూ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. బిహైండ్ ది సీన్స్తో అంచనాలు పెంచిన నిఖిల్

Rise of Swayambhu: ‘స్వయంభూ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. బిహైండ్ ది సీన్స్తో అంచనాలు పెంచిన నిఖిల్

నిఖిల్ సిద్దార్ధ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్వయంభూ’ (Swayambhu). నిఖిల్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 20వ సినిమా. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు కెమెడీ అండ్, సీరియస్ థ్రిల్లర్ సినిమాలు చేసిన నిఖిల్.. ఇలాంటి వీరయోధుడి పాత్ర చేస్తారని ఎవరు ఊహించలేదు. ప్రస్తుతం వరుస షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉంది. 

ఈ సందర్భంగా సోమవారం (2025 నవంబర్ 24న) స్వయంభు రిలీజ్ డేట్ ప్రకటించారు. వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు తెలుపుతూ వీడియో విడుదల చేశారు. రైజ్ అఫ్ స్వయంభూ (Rise of Swayambhu) పేరుతో రిలీజ్ చేసిన ఈ 2:25 నిమిషాల BTS వీడియోతో సినిమా కోసం పడిన కష్టాన్ని.. సినిమా స్థాయిని వివరిస్తుంది.

ఈ అద్భుతమైన చిత్రానికి ప్రాణం పోసేందుకు ఈ చిత్ర దర్శకుడు భరత్ కృష్ణమాచారి రెండేళ్లలో 170 రోజులు తన సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. ఈ సినిమా వెండితెరపై సాకారం చేయడానికి.. ‘ఒక సినిమా.. రెండేళ్ల కష్టం.. పదుల సంఖ్యలో సెట్స్‌.. వేల సవాళ్లు..’ అని వీడియో ద్వారా తెలిపారు.

నిఖిల్ సినిమా కథ గురించి మాట్లాడుతూ, ‘‘ఇది కేవలం ఒక రాజు కథ కాదని, భారతీయ చరిత్రలో ఇది అంతగా తెలియని అధ్యాయం’’ అని అన్నారు. అంతేకాకుండా దీనిని భారతీయ సాంస్కృతిక గొప్పతనానికి నివాళిగా నిఖిల్ అభివర్ణించారు.

ఈ పీరియాడికల్ మూవీలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు.