నిఖిల్ స్వయంభు కొత్త రిలీజ్ డేట్ ఇదే..

నిఖిల్  స్వయంభు కొత్త రిలీజ్ డేట్ ఇదే..

నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి రూపొందిస్తున్న చిత్రం ‘స్వయంభు’.   ఠాగూర్  మధు సమర్పణలో  భువన్,  శ్రీకర్ నిర్మిస్తున్నారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా,  పోస్ట్  ప్రొడక్షన్ వర్క్స్​ శరవేగంగా  జరుగుతున్నాయి.  హిస్టారికల్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో  పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీని  ఏప్రిల్ 10న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా  విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సమ్మర్ హాలీడేస్‌‌‌‌కి ఈ డేట్ పర్ఫెక్ట్  అని నిర్మాతలు భావిస్తున్నారు. నిజానికి మహాశివరాత్రి కానుకగా  ఫిబ్రవరి 13న  రిలీజ్ చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. 

అయితే సీజీ వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో సమ్మర్‌‌‌‌‌‌‌‌కు షిఫ్ట్ చేస్తూ కొత్త రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు.  ఇందులోని వీఎఫ్‌‌‌‌ఎక్స్ కోసం ఇండియాలోని టాప్ కంపెనీలు వర్క్ చేస్తున్నాయని మేకర్స్ తెలియజేశారు.   నిఖిల్ హీరోగా నటిస్తున్న 20 సినిమా ఇది.  ఇందులోని తన పాత్ర కోసం నిఖిల్ పూర్తిగా ఫిజికల్ ట్రాన్స్‌‌‌‌ఫర్మేషన్ అవ్వడంతో పాటు ఇంటెన్స్  ట్రైనింగ్ తీసుకున్నాడు.  సంయుక్త మీనన్,  నభా నటేష్  హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు.  రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.   కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు.  విజయ్ కామిశెట్టి డైలాగ్స్ రాస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌తో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి