
నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్వయంభూ’. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతోంది. అక్కడి దట్టమైన అడవులలో నిఖిల్ పై కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారు.
నిఖిల్ కెరీర్‌లో ఇది 20వ సినిమా. ఇందులో అతను లెజెండరీ వారియర్ పాత్రను పోషిస్తున్నాడు. ఇందుకోసం ఇంటెన్స్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ పీరియాడికల్ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.