టైటిల్ అదిరింది: 18 పేజీల్లో నిఖిల్

టైటిల్ అదిరింది: 18 పేజీల్లో నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ నటించనున్న కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. కుమారి 21F ఫేం పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి “18 పేజీస్” అనే పేరును ఖరారు చేసినట్లు తెలిపింది యూనిట్.  ఈ సందర్భంగా ఓ పోస్టర్ రిలీజ్ చేయగా.. అది ఆసక్తికరంగా ఉందంటున్నారు ఫ్యాన్స్. సుకుమార్ రైటింగ్స్ .. జీఏ2 పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ  మూవీకి స్టోరీ, స్క్రీన్‌ప్లే సుకుమార్ అందిస్తున్నారు. గోపి సుంద‌ర్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. నిఖిల్ సరసన నటించే హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యం తెలియాల్సి ఉంది.

see also: వైరస్ సోకిన ఆ ఇద్దరిని కలిసిందెవరు?

షేక్ హ్యాండ్ వద్దు .. నమస్తే ముద్దు