నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ లో నిఖత్ శుభారంభం

నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ లో  నిఖత్ శుభారంభం

గ్రేటర్ నోయిడా: నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన  విమెన్స్ 51 కేజీ విభాగం తొలి బౌట్‌‌‌‌లో  నిఖత్  పూర్తి ఆధిపత్యం చూపెట్టింది.  చండీగఢ్‌‌‌‌కు చెందిన నిధిపై పంచ్‌‌‌‌ల వర్షం కురిపించిన నిఖత్ 5–-0 తేడాతో ఏకపక్ష విజయం అందుకొని ప్రి క్వార్టర్ ఫైనల్  చేరింది.  

మరోవైపు వరల్డ్ చాంపియన్ మీనాక్షి (48 కేజీ) కూడా 5–0తో తమిళనాడుకు చెందిన వి. లక్షయను చిత్తుగా ఓడించింది.  -75  కేజీ విభాగంలో పోటీపడుతున్న ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గోహైన్ 5–0తో  కృష్ణా వర్మపై  ఏకపక్ష విజయం సాధించింది. మెన్స్‌‌‌‌లో  ఫేవరెట్ బాక్సర్లు శుభారంభం చేశారు  సాగర్ (50 కేజీ) 5–0తో అశుతోష్‌‌‌‌పై గెలవవగా.. సుమిత్ (75 కేజీ ) 5-–0తో  అర్ష్‌‌‌‌ప్రీత్ సింగ్‌‌‌‌ను ఓడించాడు. 70 కేజీ విభాగంలో యువ సంచలనం హితేష్   గులియా తన ప్రత్యర్థి అంకిత్‌‌‌‌ను చిత్తు చేయగా.. -60 కేజీల్లో  సచిన్ 5–0తో  తుషార్‌‌‌‌ను ఓడించాడు.