
- నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్లక్ష్మీ భాస్కర్‌పై కేసు
హైదరాబాద్ సిటీ, వెలుగు: నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఓ స్థలం వివాదంలో మోసం చేశాడంటూ రాజమండ్రికి చెందిన ఓ డాక్టర్ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజమండ్రికి చెందిన డాక్టర్వి శ్రీరాములుకు చదువుకునే రోజుల నుంచి లక్ష్మీ భాస్కర్‌తో పరిచయం ఉంది. ఇరు కుటుంబాలకు మంచి సంబంధాలున్నాయి. అయితే నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న లక్ష్మీ భాస్కర్.. శ్రీరాములుకు ఓ అనధికార భూమిని తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మించాడు. దాని విలువ మార్కెట్‌ధర రూ.5 కోట్లు ఉంటుందని, రూ.రెండున్నర కోట్లకే ఇప్పిస్తానని నమ్మించాడు. నమ్మిన శ్రీరాములు పలు దఫాలుగా సుమారు రూ.60 లక్షలకు పైగా చెల్లించాడు.
తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడం, భూమి అమ్మేది కాదని తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఏప్రిల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినా.. స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో బంజారాహిల్స్ పోలీసులు లక్ష్మీ భాస్కర్‌తో పాటు, సహకరించిన మరికొందరిపై కేసు నమోదు చేశారు.